తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ కీని కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఈ ప్రైమరీకి కి సంబంధించి ఈ నెల 16 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
Food Safety Officers Exam Primary Key
ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 16,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14,830 మంది అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోగా… 9,535 మంది పరీక్షకు హాజరయ్యారు.