Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsTSPSC Group-1 Final Key: గ్రూప్-1 ఫైనల్ కీ విడుదల.. తొలగించిన ఆ 5 ప్రశ్నలివే..

TSPSC Group-1 Final Key: గ్రూప్-1 ఫైనల్ కీ విడుదల.. తొలగించిన ఆ 5 ప్రశ్నలివే..

ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఈ నెల 29వ తేదీన ప్రైమరీ కీని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఈ నెల 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఆ అభ్యంతరాల పరిశీలనకు ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించింది.

TSPSC Group-1 Final Key- Direct Link

ఆ కమిటీ నివేదిక అందడంతో ఈ రోజు ఫైనల్ కీని విడుదల చేసింది. ఈ ఫైనల్ కీ విడుదల తర్వాత ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ ఫైనల్ కీ ఆధారంగా రిజిల్ట్స్ ను విడుదల చేయనున్నారు. పోస్టుల రోస్టర్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. అయితే.. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఫైనల్ కీని మాత్రమే విడుదల చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.

అయితే.. మొత్తం 150 ప్రశ్నలకు గాను.. అభ్యంతరాలు వ్యక్తమైన 5 ప్రశ్నలను పూర్తిగా తొలగించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. నిపుణుల కమిటీ సూచనలతో ఆ ప్రశ్నలను తొలగించినట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. మరో 3 ప్రశ్నలకు మార్పులు చేసింది. ఈ ప్రశ్నలకు ఇచ్చిన 4 ఆప్షన్లలో రెండు చొప్పున సమాధానాలు ఉన్నాయి. దీంతో.. రెండు సమాధానాల్లో అభ్యర్థులు ఏది ఆప్షన్ గా ఇచ్చినా మార్కు ఇవ్వనున్నారు. మొత్తం 150 ప్రశ్నలకు గాను.. 5 ప్రశ్నలను తొలగించడంతో 145 ప్రశ్నలు మాత్రమే మిగులుతాయి. కాబట్టి.. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు బదులుగా 1.034 మార్కులు ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. తద్వారా మొత్తం మార్కుల సంఖ్య 150కి చేరుతుంది. ఈ 150 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Note: 10 గంటల తర్వాత కీ లింక్ యాక్టివేట్ అవుతుందని టీఎఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

4 COMMENTS

  1. Hi sir my name is manisha nenu tspsc constabl ki exam rasanu but 49 Mark’s vachayi madhi bc,b chala hope pettukunanau job paina na life lo ani failures se eppudu group 1 ki radham anukunte degree undali kani nadhi eppudu final year. Daddy leru Amma okare thanani happy chusukovalani anukunna ….. Govt job ma lanti variki easy job radhu ani ardham ayipoyindhi ….kani china hope ela ayina govt job kotali ani ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!