లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తికావడంతో గ్రూప్-4 నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్‌పీఎస్సీ రెడీ అవుతోంది. త్వరలో ఎంపిక జాబితా విడుదల చేయనుంది. ఇప్పటికే జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. జనరల్ అభ్యర్థులను 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి జాబితా ప్రకటించనున్నారని సమాచారం. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనుంది. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు జులై 1న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు.
సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి
కమ్యూనిటీ, నాన్ క్రిమి లేయర్(బీసీలకు), పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్, స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్స్(క్లాస్ 1 నుంచి ఏడు వరకు), రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వీటిలో ఏ డాక్యుమెంట్ సమర్పించకపోయినా ఆ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.