HomeLATESTతెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. ప్రైమరీ కీ ఎప్పుడంటే?

తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. ప్రైమరీ కీ ఎప్పుడంటే?

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇటీవల నిర్వహించిన ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ (TS SI Mains Exam) కు సంబంధించిన ప్రైమరీ కీని రేపు అంటే.. మే 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల 14వ తేదీ లోపు తెలియజేయాలని బోర్డు సూచించింది.

Advertisement

కీపై అభ్యంతరాలను అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సమర్పించాలని బోర్డు సూచించింది. తమ అభ్యంతరాలకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను పీడీఎఫ్/జేపీఈజీ ఫార్మాట్లో అప్ లోడ్ చేయాలని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు కీ విడుదల తర్వాత https://www.tslprb.in/ వెబ్ సైట్లో కీని చెక్ చేసుకోవచ్చు. ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌ఐ ఐటీ అండ్‌ సీఓ టెక్నికల్‌ పేపర్ల (ఆబ్జెక్టివ్‌ టైప్‌) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్‌ఐ పీటీవో పరీక్షను మార్చి 26న, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ పేపర్లను ఏర్పిల్‌ 8న, జనరల్‌ స్టడీస్‌ పేపర్ల ఫైనల్‌ ఎగ్జామ్‌ను ఏప్రిల్‌ 9న నిర్వహించారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!