తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కానిస్టేబుల్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ (https://www.tslprb.in/) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ అర్థరాత్రి వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రకటించింది. హాల్ టికెట్ల డౌన్ లోడ్ పై ఏమైనా ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in మెయిల్ లేదా 9393711110, 9391005006 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసిన తర్వాత ఏ4 సైజ్ పేపర్ పై ప్రింట్ తీసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం దానిపై సూచించిన స్థలంలో పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలని తెలిపారు. లేకుంటే పరీక్షకు అనుమతించమని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది.