HomeLATESTతెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఆ రెండు నియామక పరీక్షల తేదీల ప్రకటన

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఆ రెండు నియామక పరీక్షల తేదీల ప్రకటన

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ (TSPRB) పలు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఎస్‌సీటీ పీసీ(డ్రైవ‌ర్)( SCT PC Driver ), ఎస్‌సీటీ పీసీ(మెకానిక్)( SCT PC Mechanic ) పోస్టుల‌కు ఏప్రిల్ 2న రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఏప్రిల్ 2న ఉద‌యం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఎస్‌సీటీ పీసీ(డ్రైవ‌ర్) పోస్టుల‌కు, మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ఎస్‌సీటీ పీసీ(మెకానిక్) పోస్టుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను ఈ రోజు అంటే.. మార్చి 28 తేదీ నుంచి మార్చి 31వ తేదీ అర్థ‌రాత్రి వ‌ర‌కు అధికారిక వెబ్ సైట్లో (https://www.tslprb.in/) డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

హాల్ టికెట్( Hall Ticket ) డౌన్‌లోడ్ చేసుకున్న త‌ర్వాత అభ్యర్థులు త‌మ ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాల‌ని అధికారులు సూచించారు. ఫొటోలు అతికించడానికి కేవ‌లం గ‌మ్ మాత్ర‌మే ఉప‌యోగించాలని ప్రకటనలో స్ప‌ష్టం చేశారు. హాల్ టికెట్‌పై అభ్య‌ర్థి ఒరిజిన‌ల్ పోటో లేకుంటే ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌బోమ‌ని స్పష్టం చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ఎగ్జామ్ సెంటర్ లోనికి అనుమ‌తి ఉండ‌ద‌ని ప్రకటనలో స్ప‌ష్టం చేశారు. మొబైల్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ డివైజెస్, గ‌డియారాలు, వాచ్ క్యాలికులేట‌ర్స్, ప‌ర్సులు, వాలెట్‌లు తీసుకురావొద్ద‌న్నారు. కేవ‌లం బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్ర‌మే వెంట తీసుకురావాలని సూచించారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!