Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఆన్​లైన్​ ఆఫ్​లైన్​ ఎగ్జామ్​లపై.. టీఎస్​పీఎస్​పీ కీలక నిర్ణయం

ఆన్​లైన్​ ఆఫ్​లైన్​ ఎగ్జామ్​లపై.. టీఎస్​పీఎస్​పీ కీలక నిర్ణయం

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలపై టీఎస్​పీఎస్​సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏయే పరీక్షలను ఆన్​లైన్​ లో నిర్వహించాలి.. వేటిని ఆఫ్​ లైన్​ లో నిర్వహించాలనే విషయంలో టీఎస్​పీఎస్​సీ బోర్డు కసరత్తు చేసింది. గ్రూప్స్ (GROUPS), డీఏవో (DAO) పరీక్షలు మినహా మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ ఆన్​లైన్​లోనే జరపాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రద్దయిన, వాయిదా పడ్డ పరీక్షలన్నింటినీ మే, జూన్​ లో నిర్వహించేలా కొత్త తేదీలతో పరీక్షలను రీషెడ్యూలు చేసేందుకు రెడీ అయింది.

    Advertisement

    మార్చి 5న ఆఫ్​లైన్​లో జరిగిన ఏఈ (AE) పరీక్ష, జనవరి 22న ఆఫ్​లైన్​లో జరిగిన ఏఈఈ (AEE) పరీక్షలను ఈసారి ఆన్​లైన్​లో నిర్వహించాలని కమిషన్​ నిర్ణయం తీసుకుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్​ మెంట్లకు ఒక్కొక్కరికీ ఒక్కోరోజు చొప్పున మూడ్రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రోజు సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఈ వివరాలను టీఎస్​పీఎస్​సీ ప్రకటించనుంది. నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నది.

    లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చిన పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించేందుకు అవసరమైనన్ని సెంటర్లు ఏర్పాట్లు చేయటం ఇబ్బంది అవుతుందని.. అందుకే లక్షకుపైగా అప్లికేషన్లు ఉన్న ఉద్యోగ నియామక పరీక్షలను ఆఫ్​లైన్​ లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. లక్ష కంటే తక్కువ అప్లికేషన్లు ఉన్న పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఇందులో భాగంగా ఇప్పటికే రద్దయిన డీఏవో (DAO) ఎగ్జామ్​ను, టౌన్​ ప్లానింగ్ (TOWN PLANNING) ఎగ్జామ్​ను ఆఫ్ లైన్​లో పెట్టాలని భావిస్తున్నారు. వెటర్నరీ సర్జన్ (VETERNARY SURGEON) ఎగ్జామ్ మాత్రం ఆన్​​లైన్ లో నిర్వహించనున్నారు. షెడ్యూల్​ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్, 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్, 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26, 27 గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షలను వాయిదా వేసి, ఆన్​లైన్​లోనే పెట్టనున్నారు. గ్రౌండ్ వాటర్​ ఆఫీసర్​ పోస్టులకు నిర్వహించే పరీక్షను వరుసగా రెండ్రోజుల పాటు జరపాలని యోచనలో ఉన్నారు. లైబ్రరియన్, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలనూ ఆన్‌‌‌‌ లైన్​లోనే నిర్వహించనున్నారు.

    Advertisement

    ఇప్పటివరకు టీఎస్​పీఎస్​సీ 17 వేల పోస్టులకు 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు ఏడు పరీక్షలు నిర్వహించింది. పేపర్ లీక్ తో వీటిలో నాలుగు పరీక్షలను రద్దు చేసింది. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్​లో జరగాల్సిన మరో 4పరీక్షలను వాయిదా వేయనున్నది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను జూన్ 17న నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

    గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు కావడంతో, జూన్ 11 నిర్వహిస్తామని టీఎస్​పీఎస్​సీ ఇప్పటికే రీషెడ్యూల్​ తేదీని ప్రకటించింది. ఈ పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయం అభ్యర్థుల్లో నెలకొంది. జూన్​ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు, జులై 1న గ్రూప్ 4 పరీక్షను యథావిధిగా నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ అధికారులు మంగళవారం జరిగిన మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల విషయంలో టీఎస్​పీఎస్​సీ తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. యూపీఎస్​సీ పరీక్షల షెడ్యూలుకు అనుగుణంగా రాష్ట్రంలో జరిగే పరీక్షల తేదీలను రీషెడ్యూలు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్​సీ వర్గాలు తెలిపాయి.

    Advertisement

    PRACTICE TESTS FOR ALL EXAMS

    RELATED POSTS

    DAILY TESTS

    TELANGANA HISTORY CULTURE

    GENERAL SCIENCE

    CURRENT AFFAIRS

    REASONING

    INDIAN GEOGRAPHY

    1 COMMENT

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    RECENT POSTS

    x
    error: Content is protected !!