బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్ సెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 98.18% మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీయూ వీసీ గోపాల్ రెడ్డి, ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ ఎడ్ సెట్ –2023 రిజల్ట్‌ను విడుదల చేశారు. గతనెల 18న జరిగిన ఎడ్ సెట్‌కు మొత్తం 31,725 మంది దరఖాస్తు చేసుకోగా, 27,495 మంది హాజరయ్యారు. వీరిలో 26,994 మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్రంలో 211 బీఈడీ కాలేజీలున్నాయి. వీటిఓ 18,350 సీట్లున్నాయి.
వికారాబాద్‌కు చెందిన గొల్ల వినీషా ఈసారి ఎడ్‌సెట్ టాపర్‌గా నిలిచారు. నిషాకుమారి (హైదరాబాద్), ఎం.సుషీ(హైదరాబాద్) వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు. త్వరలోనే అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
TS EDCET 2023 RESULTS AND RANK CARD DOWNLOAD LINK
రేపు ఈసెట్ ఫలితాలు
బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో సెకండియర్ లాటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ ఫలితాలు ఈనెల 13న (మంగళవారం) రిలీజ్ కానున్నాయి. మే 20న జరిగిన ఈసెట్ పరీక్షకు 22,454 మంది విద్యార్థులు అటెండయ్యారు.