తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్బీ (LLB), ఎల్ఎల్ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్(LAW CET), పీజీ ఎల్ సెట్(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు 30కి పైగా లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 36,218 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్ఎల్బీ(LLB) కోర్సుకు 25,747మంది పోటీ పడ్డారు.
మాసబ్ టాంక్ ఉన్నతవిద్యా మండలి లో లాసెట్…పీజీ లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి
చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. లా సెట్ 3 years కోర్స్ లో 78.59 శాతం, లా సెట్ 5 సంవత్సరాల కోర్సు లో 80.21 శాతం, పీజీ లా సెట్ లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 లా కాలేజీలు ఉన్నాయని.. త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సులో 4630 సీట్లు, అయిదేండ్ల డిగ్రీ కోర్సులో 2000 సీట్లు, ఎల్ఎల్ఎంలో 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.