తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో భారీ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. మొత్తం 4006 టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 28వ తేదీ.. అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది.. దరఖాస్తు చేసుకోవడానికి మే 27 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్: https://treirb.telangana.gov.in/
సొసైటీల వారీగా ఖాళీలు
– తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) -728
– తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(TTWREIS)-218
– మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(MJPTBCWREIS-2379
– తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS)594
– తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) 87
మొత్తం-4006