టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) విషయంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ ఒకసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ వాల్యూ జీవితకాలం ఉంటుందని ప్రకటించింది. ఇప్పటివరకు టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది. భవిష్యత్లో TET రాసే వారికి మాత్రమే కొత్త నిర్ణయం వర్తిస్తుంది. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుంటామని NCTE పేర్కొంది.