HomeLATESTగురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

603 గురుకులాల్లో 48,280 సీట్లు

Advertisement

తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం టీజీసెట్​–2022 నోటిఫికేషన్​ విడుదలైంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మాజ్యోతిభాపూలే సంక్షేమ గురుకుల పాశాలల్లో ఎలిజిబులిటీ టెస్ట్​ నిర్వహించి ఆయా 48, 280 సీట్లను భర్తీ చేస్తారు.

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్​డబ్ల్యూఆర్​ఈఎస్​) పరిధిలో బాలుర గురుకులాలు 90, బాలికల గురుకులాలు 140 ఉన్నాయి. వీటిలో మొత్తం 18, 560 సీట్లు ఉన్నాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్​ఈఐఎస్​)లో బాలుర గురుకులాలు 35, బాలికల కోసం 42 ఉన్నాయి. వీటిల్లో 6, 080 సీట్లున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ( టీఆర్​ఈఐఎస్​)లో బాలురకు 15, బాలికలకు 20 గురుకులాలున్నాయి. వీటిల్లో మొత్తం 2,840 సీట్లు, మహాత్మాజ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్కథల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్​ఈఐఎస్​)లో బాలుర గురుకులాలు 132, బాలికల కోసం 129 గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా మొత్తం 20, 800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.

ఎంట్రెన్స్​ ఎగ్జామ్
ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్​టైపులో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్​, మ్యాథ్స్​, మెంటల్​ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు సంబంధించి 3, 4వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లీష్​ మాధ్యమాల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది.

Advertisement

అప్లికేషన్​ ప్రాసెస్​
ఆసక్తి గల విద్యార్థులు మార్చి 28లోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. అప్లికేషన్​ ఫారంలో తప్పనిసరిగా తల్లిదండ్రుల సంబంధించిన ఫోన్​ నంబర్​ మాత్రమే ఇవ్వాలి. పరీక్షకు 10 రోజుల ముందు హాల్​ టికెట్​ డౌన్​ చేసుకోవాలి. మే 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు పరీక్ష పరీక్ష నిర్వహిస్తారు.

వెబ్​సైట్​ : www.tswreis.ac.in
www.tgcet.cgg.gov.in
www.tgtwgurukulam.telangana.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!