Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఇంగ్లిష్​ మీడియంలో మెగా డీఎస్సీ: టీఆర్​టీ మళ్లీ జిల్లాలకే​

ఇంగ్లిష్​ మీడియంలో మెగా డీఎస్సీ: టీఆర్​టీ మళ్లీ జిల్లాలకే​

తెలంగాణాలో భారీగా టీచర్​ పోస్టులను భర్తీ కానున్నాయి. సుమారు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ త్వరలోనే వెలువడనుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ సెకండరీ విద్యలో 13,086 ఖాళీలున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే వాటికి తోడు మరో 10నుంచి 12వేల ఖాళీలు ఏర్పడనున్నాయి.

పదోన్నతుల ద్వారా ఎల్​ఎఫ్​ఎల్​ హెచ్​ఎం పోస్టులు 2వేలు ఎస్జీటీల ద్వారా, గెజిటెడ్​ హెచ్​ఎం 1,970 పోస్టులు స్కూల్​ అసిస్టెంట్​ల ద్వారా, స్కూల్​ అసిస్టెంట్​ పోస్టులు 70శాతం ఖాళీలు ఎస్జీటీల ద్వారా భర్తీ య చేయనున్నారు. దీంతో సుమారు 10వేల ఖాళీలు ఏర్పడనున్నాయి.

తాజాగా ప్రకటించిన పోస్టులు ప్రస్తుతం నోటిఫికేషన్​ జారీ చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీలకు అనుబంధ నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది. ఇందులో సెకండరీ గ్రేడ్​ టీచర్​(ఎస్​జీటీ) పోస్టులే సుమారు 18వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఎస్టీజీ రిక్రూట్​మెంట్​లో 70 శాతం రిజర్వేషన్​ కలిగిన డీఈడీ(టీటీసీ) అభ్యర్థులకు గొప్ప చాన్స్​ అని చెప్పవచ్చు.

అయితే డీఎస్సీ లేదా టీఆర్టీ నిర్వహించే ముందు ఎన్​సీటీఈ నిబంధనల మేరకు ప్రభుత్వం టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ TET​ నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చివరి సారిగా 2017లో టెట్​ జరిపారు. ఇప్పుడు బీఈడీ చేసిన వారికి కూడా ఎస్టీజీ పోస్టులకు అర్హత కల్పించగా వారికి టెట్​ పేపర్​ 1 రాసే అవకాశం కల్పిస్తారు.

వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష ఇంగ్లీష్​ మీడియంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా టెట్​ నిర్వహణ, ఫలితాల ప్రకటన అనంతరం టీఆర్​టీ నిర్వహణ, ఫలితాలు, మెరిట్​ జాబితా విడుదల, కౌన్సెలింగ్​ నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 6 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్న మాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు తొలిసారిగా 2017లో చేపట్టారు. అనంతరం ఐదేళ్ల తర్వాత నోటిఫికేషన్​ విడుదల కానుంది. దీంతో లక్షలాది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు మెగా డీఎస్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!