తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఏప్రిల్లో జరిగే ఫస్టియర్, సెకెండియర్ ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. జనరల్, ఒకేషన్ కోర్సుల్లో రెగ్యులర్, ఫెయిలైన సబ్జెక్టులకు పరీక్షలు రాసే విద్యార్థులు బుధవారం నుంచి సంబంధిత కళాశాలల నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇటీవల నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో పాసైన విద్యార్థులు (ప్రభుత్వం పాస్ చేసిన వారు కూడా) ఇంప్రూవ్మంట్ కోసం ఫీజు చెల్లించుకోవచ్చని బోర్డ్ పేర్కొంది.
ఫీజు చెల్లింపు షెడ్యూల్
అపరాధ రుసుం లేకుండా: ఈ నెల 5 నుంచి 24 వరకు
రూ.100 ఫైన్: ఈ నెల 25 నుంచి 31 వరకు
రూ.500 ఫైన్: ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు
రూ.1000 ఫైన్: ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు
వెబ్సైట్: www.tsbie.cgg.gov.in