ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 120
1) జనరల్: 80
2) లీగల్: 16
3) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ): 14
4) రీసెర్చ్: 7
5) అఫీషియల్ లాంగ్వేజ్: 3
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 31 డిసెంబర్ 2021 నాటికి 30 ఏళ్లు మించరాదు.
సెలెక్షన్ ప్రాసెస్: మూడు దశల్లో ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: మొదటిది ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఫేజ్ 1 స్క్రీనింగ్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్‌కి ఎంపిక చేస్తారు. ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ హిందీ లేదా ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. ఫేజ్ 2లో సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
చివరి తేది: 24.01.2022.
ఫేజ్ 1 ఎగ్జామ్: 20 ఫిబ్రవరి 2022.
ఫేజ్ 2 ఎగ్జామ్ (ఐటీ పేపర్ మినహాయించి): 20 మార్చి 2022.
ఫేజ్ 2 (పేపర్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పరీక్ష: 3 ఏప్రిల్ 2022.
తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, వరంగల్
వెబ్సైట్: www.sebi.gov.in