తెలంగాణ హైకోర్టులో వివిధ జాబ్స్‌కు నోటిఫికేషన్ వెలువడింది. జడ్జిలతో పాటు రిజిస్ట్రార్ల పర్సనల్ సెక్రెటరీలు, కోర్టు మాస్టర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం 65 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోని ఏ యూనివర్సిటీ నుంచైనా డిగ్రీ లేదా ఎల్ఎల్బీ (లా గ్రాడ్యుయేట్) పూర్తయిన వారందరూ ఈ పోస్టులకు అర్హులే. అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. 34 ఏండ్ల వయసు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఇచ్చారు. ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 800 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారు రూ. 400 చెల్లించాలి. ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), తెలంగాణ హైకోర్టు పేరిట ఈ డీడీలను తీయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా జులై 22 సాయంత్రం 5 గంటల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలి. అర్హతలు, దరఖాస్తు ఫారాలు.. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు హైకోర్టు వెబ్‌సైట్ https://tshc.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పీడీఎఫ్ ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం
Police