తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. తాజాగా మరో 4600 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మరో 4600 ఉద్యోగాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలోని వివిధ న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4600 ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీకి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. దీంతో ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ 4600 ఉద్యోగాలు కాకుండా.. మరో 7029 ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పోలీస్ శాఖలో (TS Police Jobs) 3966, ఆర్&బీలో 472 అదనపు పోస్టుల నియామకానికి అనుమతి లభించింది. ఇంకా.. మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మరో 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు ఆమోదం లభించింది.
ఇప్పటికే రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్న తరుణంలో ఈ ప్రకటన నిరుద్యోగుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది. కష్టపడి ప్రిపేర్ అయితే.. ఒక జాబ్ మిస్ అయినా.. మరో ఉద్యోగమైనా లభిస్తుందన్న ఆశతో ఉద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.