దేశవ్యాప్తం గా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో దాదాపు 5000 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతానికి 4484 ఖాళీలున్నాయి.ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు ఉంటాయని నోటిఫికేషన్లో ప్రకటించారు. హైదరాబాద్‌లో బొల్లారం, ఆర్కే పురంతో పాటు గోల్కొండలో ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి.
బీఈడీతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ చేసిన అర్హతలున్న అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులే. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్లైన్లో అక్టోబర్ 20వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్షల ఆధారం గా సెలెక్షన్ ఉంటుంది.
పరీక్ష తేదీ; నవంబర్ 21, 22
పరీక్ష కేంద్రాలు; హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడతో పాటు దేశవ్యాప్తంగా 74 ఎగ్జామ్ సెంటర్లున్నాయి.
పూర్త్ వివరాలకు వెబ్ సైట్; http://aps-csb.in/
| To Join Whatsapp | |
| To Join Telegram Channel |
నోటిఫికేషన్ పీడీఎఫ్‌లో పూర్తి వివరాలు ఉన్నాయి.
| To Join Whatsapp | |
| To Join Telegram Channel |





