స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 17ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ssc.nic.in ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(MTS)- 10,880
హవల్దార్ (CBIC & CBN) -529
Read This: టెన్త్ అర్హతతో 40,889 పోస్ట్ ఆఫీస్ జాబ్స్.. తెలంగాణ, ఏపీలోనూ భారీగా ఖాళీలు.. పూర్తి వివరాలివే
అర్హతలు:
అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. CBN (రెవెన్యూ శాఖ)లో MTS, హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. CBIC (రెవెన్యూ శాఖ)లో హవల్దార్, కొన్ని MTS పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు జనవరి 1, 2023 నాటికి 18-27 ఏళ్లు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
– ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ssc.nic.in ఓపెన్ చేయాలి. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ సెక్షన్లో ‘రిజస్టర్ నౌ’ లింక్‌పై క్లిక్ చేయాలి.
– కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపాలి.
– ఆ తరువాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. ‘లెటెస్ట్ నోటిఫికేషన్స్’ సెక్షన్లో ‘మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ అండ్ హవల్దార్ (CBIC & CBN) ఎగ్జామినేషన్, 2022’ కు సంబంధించి అప్లై లింక్‌ను క్లిక్ చేయాలి.
– తర్వాతి విండోలో ఇతరన వివరాలను నింపి, అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్ లోడ్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
– ఆఖరికి ఫామ్‌ను సబ్మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం ఈ డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసుకుని దాచుకోవాలి.