Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSసెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్స్​.. 1324 జూనియర్​ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్​

సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్స్​.. 1324 జూనియర్​ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్​

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివిన వారికి గుడ్ న్యూస్​. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్​ నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) భారీ నోటిఫికేషన్​ జారీ చేసింది. వివిధ విభాగాల్లో దాదాపు 1324 ఖాళీలను భర్తీ చేయనుంది. కేంద్ర జలసంఘం, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్‌ స్టేషన్, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీస్, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌, పోర్ట్స్‌, షిప్పింగ్‌ & వాటర్‌వేస్‌ తదితర సంస్థల్లో ఈ ఖాళీలున్నాయి.

Advertisement

అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు. వయసు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లికేషన్ల నమోదు ప్రక్రియ మొదలైంది. ఆగస్ట్ 16వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు ఉంది. పూర్తి  వివరాలు www.ssc.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షను అక్టోబర్ లో నిర్వహిస్తారు. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.

ఎగ్జామ్ ప్యాటర్న్:  పరీక్ష రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1 ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-2 ఆఫ్‌లైన్‌లో జరిగే(డిస్క్రిప్టివ్‌) రాత పరీక్ష. పేపర్‌-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌-2లో పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్‌ పరీక్ష. పేపర్‌-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

Advertisement

అర్హతలు : దరఖాస్తు చేసే పోస్టును అనుసరించి అభ్యర్థుల అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు మినహాయింపు) వివరాలకు సంబంధిత వెబ్ సైట్ ను సందర్శించండి..

దరఖాస్తు విధానం: ఎస్ఎస్ సీ అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు: 1,324

Advertisement
  1. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులు మాత్రమే) జేఈ(సీ): 431, జేఈ(ఈఅండ్ఎం): 55
  2. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జేఈ(సీ): 421, జేఈ(ఈ): 124
  3. సెంట్రల్ వాటర్ కమిషన్ జేఈ(సీ): 188. జేఈ(ఎం): 23
  4. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జేఈ(సీ): 15, జేఈ(ఎం): 6
  5. మిలిటరీ ఇంజినీర్ సేవలు జేఈ(సీ): 29, జేఈ(ఈఅండ్ఎం): 18
  6. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) జేఈ(సీ): 7, జేఈ(ఎం): 1
  7. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జేఈ(సీ): 4, జేఈ(ఈ): 1, జేఈ(ఎం): 1

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!