HomeLATESTఅంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీలో స్పెషల్ బీఈడీ

అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీలో స్పెషల్ బీఈడీ

హైదరాబాద్​లోని డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ లో స్పెషల్​ బీఈడీ ప్రోగ్రామ్​ 2022‌‌–23 అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజైంది. ఇందులో విజువల్​ ఇంపెయిర్​మెంట్​, హియరింగ్​ ఇంపెయిర్​మెంట్​, ఇంటలెక్చువల్​ డిజెబిలిటీ లో స్పెషలైజేషన్​లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్​ వ్యవధి రెండేళ్లు ఉంటుంది. ఇందులో 5 సెమిస్టర్​లు ఉంటాయి. ఎంట్రెన్స్​ టెస్ట్​, కౌన్సెలింగ్​ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ఎనీ డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్​కు అప్లై చేసుకోవచ్చు. బీటెక్​/బీఈ ఉత్తీర్ణులైనవారు కూడా అర్హులే. 2021 జూన్​ నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

ఈ కోర్సు పూర్తి చేస్తే భవిష్యతులో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మానసిక వికలాంగులు, ప్రత్యేకావసరాలున్న పిల్లలు చదువుకునే స్కూళ్లలో స్పెషల్​ బీఈడీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాల ఎంపికలో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు.

ఈ ప్రోగ్రామ్​లో చేరాలనుకునే అభ్యర్థులు ఎంట్రెన్స్​ టెస్ట్​ రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ పూర్తిగా ఆబ్జెక్టివ్​ టైపులో ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలుంటాయి. ఇందులో రెండు పార్టులు ఉంటాయి. మొదటి పార్ట్​లో జనరల్​ ఇంగ్లిష్​ కాంప్రహెన్షన్​ నుంచి 40 ప్రశ్నలు, రెండో పార్ట్​లో జనరల్​ మెంటల్​ ఎబిలిటీ, లాజికల్​ అండ్​ అనలిటికల్​ రీజనింగ్​, వెర్బల్​ అండ్​ అబ్​స్ట్రాక్ట్​ రీజనింగ్​ అంశాల నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు.

Advertisement

ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరితేది మార్చి11. ఎంట్రెన్స్​ టెస్ట్​ మార్చి 20న నిర్వహిస్తారు. ప్రోగ్రామ్​ ఫీజు రూ. 30 వేలు, దరఖాస్తు ఫీజు రూ. 600

వెబ్​సైట్​ : www.braouonline.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!