HomeLATESTమేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్​కు సీమ్యాట్​ నోటిఫికేషన్​ రిలీజ్​

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్​కు సీమ్యాట్​ నోటిఫికేషన్​ రిలీజ్​

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్‌(సీమ్యాట్‌) 2022 ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దీని ద్వారా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు. ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సీమ్యాట్‌-2022 ప‌రీక్షకు వ‌య‌సుతో సంబంధం లేదు.

Advertisement

సెలెక్షన్​ ప్రాసెస్​

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూట‌ర్ బేస్డ్ ప్రవేశ ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తోంది. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ టెక్నిక్ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, ఇన్నవేషన్‌ అండ్‌ ఆంత్రప్రిన్యూర్‌షిప్‌ అంశాలు ఉంటాయి. క్వశ్చన్​ పేపర్​ ఇంగ్లిష్​ మీడియంలో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలుంటాయి, ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 400 మార్కుల‌కు దీన్ని నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి త‌ప్పు స‌మాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

అప్లికేషన్ ఫీజు జ‌న‌ర‌ల్ పురుష అభ్యర్థుల‌కు- రూ. 2000, జ‌న‌ర‌ల్ స్త్రీ అభ్యర్థుల‌కు- రూ.1000, ఇత‌ర స్త్రీ, పురుష అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. మార్చి 17వ తేదీ లోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం సంబంధిత వెబ్​సైట్: www.cmat.nta.nic.in సంప్రదించాలి.

గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) 2022

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) 2022 నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. దీని ద్వారా ఎంఫార్మా కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తున్నారు. ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిల‌ర్స్ డిగ్రీతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. జీప్యాట్‌‌-2022 ద‌ర‌ఖాస్తుకు వ‌య‌సుతో సంబంధం లేదు.

Advertisement

సెలెక్షన్​ ప్రాసెస్​

క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కష‌న్ అండ్ ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామ్​లో 125 ప్రశ్నలుంటాయి, ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 500 మార్కుల‌కు దీన్ని నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి త‌ప్పు స‌మాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

అప్లికేషన్ ఫీజు జ‌న‌ర‌ల్ పురుష అభ్యర్థుల‌కు- రూ. 2000, జ‌న‌ర‌ల్ స్త్రీ అభ్యర్థుల‌కు- రూ.1000, ఇత‌ర స్త్రీ, పురుష అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. మార్చి 17వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు వెబ్​సైట్: www.gpat.nta.nic.in ను సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!