Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSపేపర్​ లీక్​ కేసులో ట్విస్ట్.. టీఎస్​పీఎస్​సీ సెక్రెటరీకి సిట్​ నోటీసులు

పేపర్​ లీక్​ కేసులో ట్విస్ట్.. టీఎస్​పీఎస్​సీ సెక్రెటరీకి సిట్​ నోటీసులు

టీఎస్​పీఎస్​సీ పేపర్ లీకేజీ (TSPSC PAPER LEAK CASE) కేసులో బోర్డు ఛైర్మన్​తో పాటు బోర్డు మెంబర్లను విచారించేందుకు సిట్​ (Special Investigation Team) సన్నద్ధమవుతోంది. బోర్డు మెంబర్​ ​ప్రొఫెసర్​ లింగారెడ్డికి శుక్రవారం ఉదయం సిట్​ నోటీసులు జారీ చేసింది. ఇదే రోజు సాయంత్రం బోర్డు సెక్రెటరీ అనితా రామచంద్రన్​కు సిట్​ నోటీసులు ఇచ్చింది. వీరిద్దరిని శనివారం ఉదయం సిట్​ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే లింగారెడ్డి పీఏ రమేష్​ను సిట్​ ఇదే కేసులో అరెస్ట్ చేసింది. సెక్రెటరీ దగ్గర పీఏ​గా పని చేసిన ప్రవీణ్​ పేపర్​ లీకేజీ కేసులో ప్రధాన నిందితునిగా సిట్​ గుర్తించింది. అతడిని కూడా అరెస్ట్ చేసింది.

Advertisement

కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మొత్తం 15 మందిని సిట్​ అరెస్ట్ చేసింది. టీఎస్​పీఎస్​సీ ఉద్యోగులు సహా దాదాపు ఇరవై మందిని విచారించింది. విచారణలో భాగంగానే బోర్డు మెంబర్లలో ఒకరైన లింగారెడ్డికి, సెక్రెటరీ అనితా రామచంద్రన్​కు నోటీసులు జారీ చేసినట్లు సిట్​ అధికారులు ధ్రువీకరించారు. ఇదే వరుసలో ఇతర బోర్డు మెంబర్లను, టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్​ ను విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టీఎస్​పీఎస్​సీలో పని చేస్తున్న ఔట్ ​సోర్సింగ్​ ఉద్యోగులను ఎవరు నియమించారనే కోణంలో సిట్​ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్​ కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులతో పాటు సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ ఇచ్చిన వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తు సాగుతోందని సిట్​ వర్గాలు చెబుతున్నాయి.

టీఎస్​పీఎస్​సీ లో ప్రస్తుత బోర్డు మెంబర్లు

  1. రమావత్​ధన్​సింగ్
  2. ప్రొఫెసర్​ బండి లింగారెడ్డి
  3. కొట్ల అరుణ కుమారి
  4. సుమిత్ర ఆనంద్​తనోబ
  5. కారం రవీందర్​రెడ్డి
  6. అర్వెల్లి చంద్రశేఖర్​ రావు
  7. ఆర్. సత్యనారాయణ

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!