Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఏప్రిల్ 8,9 తేదీల్లో ఎస్ఐ రాత పరీక్షలు.. హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే?

ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎస్ఐ రాత పరీక్షలు.. హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే?

తెలంగాణలో పోలీస్ నియామక పరీక్షలకు సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక ప్రకటన చేసింది. ఎస్ఐ రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు.. మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6 వరకు అధికారిక వెబ్ సైట్ (https://www.tslprb.in/) నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని బోర్డు ప్రకటించింది. అభ్యర్థులు హాల్ టికెట్లపై పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా అంటించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

8వ తేదీ ఉదయం అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ పేపర్.. మధ్యాహ్నం ఇంగ్లింష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష ఉంటుంది. 9వ తేదీ ఉదయం జనలర్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు/ఉర్దు పరీక్ష పేపర్ ఉంటుంది. ఈ పరీక్షలను హైదరబాద్, వరంగల్&కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!