తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో అయిదు రోజులే గడువుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులన్నీ కలిపితే ఇప్పటికే నమోదైన అప్లికేషన్లు 4 లక్షలు దాటాయి. ఈనెల 20వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఈసారి 7 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం జులై 31 లేదా ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని TSLPRB భావిస్తోంది. ఎస్ఐ పరీక్ష తర్వాత రెండు వారాల తర్వాత ఆగస్టు 21న కానిస్టేబుల్ (CONSTABLE), ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 28 నాటికి ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి చేయాలని టీఎస్ఎల్పీఆర్బీ భావిస్తోంది. దీంతో ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన రిజల్ట్స్ సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు వీలుగా ఉంటుందని షెడ్యూలు రెడీ చేసుకుంది. ఎస్ఐ, కానిస్టేబుల్, వివిధ విభాగాల్లో ప్రకటించిన ఉద్యోగాలకు అప్లికేషన్ల గడువు ఈనెల 20వ తేదీన ముగియనుంది. గడువు ముగిసిన తర్వాత క్వశ్చన్ పేపర్ల తయారీ, ముద్రణకు కనీసం నెలన్నర టైమ్ పడుతుంది. అందుకే . జులై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ నిర్వహించే అవకాశాలున్నాయని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు మరోసారి అప్లికేషన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అక్తోబర్-నవంబర్ మధ్య ఈవెంట్స్ నిర్వహించేందుకు వీలుగా టెంటేటివ్ షెడ్యూలును బోర్డు తయారు చేసుకుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ డిసెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య నిర్వహించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం సెలక్షన్ లిస్టు 2023 ఫిబ్రవరి, మార్చిలో వెలువడుతుంది.
జులై 31 లేదా ఆగస్ 7న ఎస్ఐ ప్రిలిమ్స్
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





