తక్కువ టైమ్‌లో ఎక్కువ మార్కులు సాధించే టిప్స్..
టెట్ పరీక్షకు ఇంకా సుమారు 25రోజుల సమయముంది. ఇంకా సైకాలజీ సబ్జెక్ట్‌ను పూర్తి చేయలేకపోయాం.. ఎంత చదివినా గుర్తుండడం లేదు.. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయో అర్ధం కావడం లేదు.. అప్లికేషన్ టైప్‌లో ప్రశ్నలు వస్తే ఎలా ఆన్సర్ చేయాలి.. గతంలో ఇచ్చిన ప్రశ్నలు ఎక్కువగా ఏఏ టాపిక్ల నుంచి అడిగారనే అయోమయంలో ఉన్న అభ్యర్థులకు ఈ కీలక సమయంలో ఉపయోగపడే టిప్స్ అందిస్తున్నాం.. ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి చివరి వరకు చదవండి..
- సైకాలజీలో గతంలో నిర్వహించిన టెట్ ప్రశ్నలను పరిశీలించినట్టయితే.. లెక్కలకు సంబంధించి ఒక బిట్ తప్పనిసరిగా అడుగుతున్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన బీఈడీ, డీఈడీ పుస్తకాల్లో మొత్తం 4 రకాల లెక్కలు మాత్రమే ఉన్నాయి. అవి
- పొదుపు గణన
- ప్రజ్ఞాలబ్ది
- మానసిక వయస్సు
- గుర్తింపు గణన
పైన ఇచ్చిన లెక్కల సూత్రాలను గుర్తుంచుకుంటే చాలు సైకాలజీలో ఒక మార్కు సాధించినట్టే.. గతంలో నిర్వహించిన టెట్లన్నింటిలోనూ లెక్కలకు సంబంధించి ప్రశ్న తప్పనిసరిగా అడిగారు.
- గ్రంథాలు–రచయితలకు సంబంధించిన ప్రశ్నను తప్పనిసరిగా అడుతున్నారు. సైకాలజీ పుస్తకాన్ని పరిశీలిస్తే.. లేదా పలు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాల్లో సైకాలజీ శాస్త్రవేత్తలు–వారి రచనలు ప్రచురించారు. వాటిని బట్టి పట్టడం లేదా కోడ్ రూపకంగా గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు మన ఖాతాల్లో ఉన్నట్టే..
- సైకాలజీ శాస్త్రవేత్తలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించి ఇచ్చిన నిర్వచనాలను గుర్తుంచుకోవాలి. అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమే అయినా.. ఏదైనా కోడ్ పదాలను ఆధారంగా షార్ట్‌కట్ మెథడ్‌లో నేర్చుకోవడం ఉత్తమం.
- సైకాలజీ టెర్మినాలజీ పై ప్రశ్న అడుగుతున్నారు. పదాలు అవి ఏ భాషలో ఉన్నాయి.. ఏ భాష నుంచి ఉద్భవించాయి అని తెలుసుకోవాలి. సైకాలజీ పుస్తకాల్లో ఇలాంటివి దాదాపు 20 పదాల వరకు ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
- మానవ వికాస సూత్రాలు సైకాలజీలో 9 ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఒకదాని నుంచి గతంలో అడిగారు. వీటిపై దృష్టిపెడితే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
- పియాజే సిద్ధాంతం నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో స్కీమా, ప్రచాలకం, సాంశీకరణం, అనువంశీకత సంబంధించి అప్లికేషన్ టైప్ ప్రశ్నలు లేదా.. ఇంద్రియా చాలకదశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలకదశ, అమూర్త ప్రచాలకదశ గురించి సమగ్రంగా చదువుకుంటే.. ఒక మార్కు సాధించినట్టే..
- కోల్బర్గ్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మూడు స్థాయిలు,ఆరు దశల నుంచి అప్లికేషన్ టైప్‌లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దీనికి ఒక గంట సమయం కేటాయిస్తే సరిపోతుంది.
- చోమ్స్కీ సిద్ధాంతం నుంచి కూడా తరుచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈయన వివరించిన సిద్ధాంతం తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథాడాలజీలో కూడా వస్తుంది.
కాబట్టి ఈ టాపిక్‌ను చదివితే రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది. - ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి తప్పనిసరి ప్రశ్న వస్తుంది. దీనీనే మనోసాంఘీక వికాస సిద్ధాంతం అని కూడా అంటారు. ఇందులో మొత్తం 8 దశలున్నాయి. అవి ఏ ఏ వయసుకు సంబంధించినవి?.. ఆయా దశల్లో పిల్లవాని ప్రవర్తనలో కలిగే మార్పులు ఏవి? వాటి వల్ల ఏర్పడే క్లిష్ట పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేస్తే ఒక మార్కు సాధించినట్టే..
- వ్యక్తంతర బేధాలు, వ్యక్తంర్గతబేధాలు టాపిక్ నుంచి కూడా తరుచుగా బిట్ అడుగుతున్నారు. ఇది చాలా సింపుల్ టాపిక్ ఒక ఐదు నిమిషాల్లో అర్ధమవుతుంది. వీటికి సంబంధించి మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే మార్కు సాధించినట్టే..
- ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ లేకుండా ఇప్పటి వరకు పేపర్ లేదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీటిని ఒక 30 నిమిషాల్లో చదివి గుర్తుంచుకోవచ్చు.
- సహజ సామర్థ్యాలకు సంబంధించి నిర్వచనాలు లేదా DAT, GAT శాబ్దిక, నిష్పాదన సామర్థ్య పరీక్షలకు సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది.
- మానవ వికాసం పెరుగుదలలో మానవ గ్రంథి వ్యవస్థ పనితీరు సంబంధించి, ఏఏ అంశాలపై ఏ ఏ గ్రంథులు ప్రభావం చూపిస్తాయనే అంశాలు చదువుకుంటే తప్పనిసరి ప్రశ్న అడిగే అవకాశం ఉంది.
- సంఘర్షణలు–రకాలు, రక్షక తంత్రాలు సంబంధించి తప్పనిసరి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. వీటిని కూడా కేవలం 15 నిమిషాల్లోనే చదువుకుని అర్థం చేసుకోవచ్చు. వీటిపై అప్లికేషన్ టైప్ ప్రశ్నలు వస్తాయి. వీటిని సంబంధించి చాలా రకాల మోడల్ ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
- అభ్యసన బదలాయింపు సంబంధించి ప్రశ్నలో బదలాయింపు రకాలు అడుగుతున్నారు. ఇది కూడా అప్లికేషన్ టైప్ ప్రశ్న వస్తుంది. మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈజీ టాపిక్.
- శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలనాత్మక అభ్యసనం, సాంఘీక సాంస్కృతిక అభ్యసనం సిద్ధాంతాలకు సంబంధించి శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు, సిద్ధాంతాల నుంచి వచ్చిన నియమాలు అర్ధం చేసుకుంటే ఏ విధమైన ప్రశ్న వచ్చిన జవాబు గుర్తించే అవకాశం ఉంటుంది. వీటి నుంచి దాదాపు 3–4 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి.
- చివరగా స్మృతి–విస్మృతి నుంచి తప్పనిసరి ప్రశ్న వస్తుంది. వీటిల్లో స్మృతి రకాలు, పొదుపు గణన, ఎబ్బింగ్హాస్ పట్టిక. స్మృతి కారకాలు, అవరోధాలు అంశాలను చదివితే మార్కుసాధించవచ్చు.
- వీటితో పాటు పెడగాగిలోని అంశాలు విద్యాహక్కు చట్టం–2009, ఎన్సీఎఫ్–2005, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సమ్మిళిత విద్య, మూర్తిమత్వం, మార్గదర్శకత్వం, బోధన దశలు ఒకసారి చదువుకుంటే పెడగాగి నుంచి ఆరు మార్కులకు గాను 5 మార్కులు తప్పనిసరి సాధించే అవకాశం ఉంది.
ఈ చివరి సమయంలో పై అంశాలను అభ్యర్థులు చదువుకుంటూ ఒక సారి రివిజన్ చేసుకుంటే 25 మార్కులు సాధించవచ్చు. వీటన్నిటికి 20 నుంచి 30 గంటల సమయం సరిపోతుంది. ప్రతి రోజు రెండు నుంచి మూడు గంటలు సైకాలజీకి కేటాయించుకుంటే మీరు భారంగా ఫీలవుతున్న సైకాలజీ సబ్జెక్ట్ పది రోజుల్లోనే పూర్తి చేయవచ్చు.
Bagundhi chala
Good information for a short time
Good information Tq
Yes and yes valla video la undhi
Thank you sir
Thank you for the information
Thank u for the information
Book motham prepare avandi ani chepochu kada inka
Tq sir…..
L.baby
Thanku for the informetion
Thank you so much sir
Super