Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairs18న రాజీవ్ గాంధీ యూత్​ క్విజ్​.. గెలిచేందుకు టిప్స్​

18న రాజీవ్ గాంధీ యూత్​ క్విజ్​.. గెలిచేందుకు టిప్స్​

కాంగ్రెస్​ పార్టీ వచ్చే నెల 18వ తేదీన రాజీవ్​గాంధీ యూత్​ క్విజ్ (rajiv gandhi youth quiz)​ పోటీ నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్​లైన్​లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువతీ యువకులందరూ ఈ క్విజ్​ పోటీని సద్వినియోగం చేసుకోవాలి. 16 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సున్న వారందరూ ఈ పోటీలకు అర్హులే.

రిజిస్ట్రేషన్​​ ఉచితం.. ఈజీ

ఈ పోటీలో పాల్గొనాలంటే ముందుగా అభ్యర్థులు ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ ముచ్చటగా మూడే మూడు నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది కూడా పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన వెబ్​సైట్​ www.rajivgandhiyouthquiz.com. జూన్​ 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు తుది గడువు ఉంది.

అభ్యర్థులు తమ పేరు, మొబైల్​ నెంబర్​, పుట్టిన తేదీ, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంటర్​ చేస్తే సరిపోతుంది. ముందుగా మొబైల్​ నెంబర్​ ఎంటర్ చేయగానే వచ్చే ఓటీపీ ద్వారా మిగతా వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. వెంటనే మీకు పరీక్ష రోల్​ నెంబర్​ అలాట్​ అవుతుంది.

Advertisement

ఏమేం బహుమతులు

ప్రతి నియోజకవర్గంలో 45 మంది విజేతలు బహుమతులు అందుకునే ఛాన్స్​ ఉంటుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 5355 మంది విజేతలుగా ఎంపికవుతారు. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ మంది.. కొన్ని చోట్ల ఎక్కువ మంది పోటీ పడే అవకాశముంటుంది. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఈ క్విజ్​లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

స్పెషల్​ ప్రైజ్:​ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన మహిళా విజేతకు ఎలక్ట్రిక్​ స్కూటీ
ఫస్ట్ ప్రైజ్:అత్యధిక మార్కులు సాధించిన విజేతకు ల్యాప్​ టాప్​
సెకండ్​ ప్రైజ్:స్టార్ట్ ఫోన్​
థర్డ్​ ప్రైజ్:టాబ్లెట్​​
కన్సోలేషన్​ బహుమతులు :మార్కుల మెరిట్​ ఆధారంగా వరుసగా మరో 40 మంది విజేతలకు కన్సోలేషన్​ బహుమతులు అందిస్తారు. (10 స్టార్ట్ వాచ్​లు, 10 ఇయర్​ పాడ్స్​, 10 హార్డ్ డ్రైవ్స్​, 10 పవర్​ బ్యాంక్స్​)

మొబైల్​ నుంచే పరీక్ష రాయొచ్చు

పరీక్ష రాసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన వృథా ప్రయాస ఉండదు. 18వ తేదీన మీకు పంపించిన ఆన్​లైన్​ లింక్ ద్వారా మొబైల్​ లేదా లాప్​ టాప్​ డెస్క్​ టాప్​ నుంచి ఈ పరీక్ష అటెండ్ కావాల్సి ఉంటుంది. మొబైల్​ లో నెట్​ కనెక్టవిటీ ఉంటే సరిపోతుంది. పరీక్షలో కేవలం 60 ప్రశ్నలుంటాయి. 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఏమేం ప్రశ్నలుంటాయి

రాజీవ్​ గాంధీ యూత్​ క్విజ్​ నిర్వహకులు ఇచ్చిన సిలబస్​ ప్రకారం ఈ టాపిక్​ల నుంచి ప్రశ్నలుంటాయి.

Advertisement
  • General knowledge & Current affairs
  • Indian History and Freedom Movement
  • History of Telangana and Telangana Movement
  • India s Development – Plans & Policies
  • General Mental Ability and Logical Reasoning
  • (ఈ టాపిక్​ లకు సంబంధించి దాదాపు 500కుపైగా ప్రాక్టీస్​ టెస్ట్ లు మెరుపులు.కామ్​ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కేవలం క్విజ్​ను దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి క్విజ్​ ప్రాక్టీస్​ టెస్ట్ పేరుతో 17వ తేదీ వరకు డెయిల్​ టెస్ట్ లను అందిస్తాం. ఇవన్నీ అభ్యర్థుల ప్రాక్టీస్​కు తప్పనిసరిగా ఉపయోగపడుతాయి.)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!