HomeLATESTపోడు భూముల పట్టాల పంపిణీ.. కేసులు ఎత్తివేస్తామన్న సీఎం.. హైకోర్టుకు హాజరైన మంత్రి.. రేపే గ్రూప్...

పోడు భూముల పట్టాల పంపిణీ.. కేసులు ఎత్తివేస్తామన్న సీఎం.. హైకోర్టుకు హాజరైన మంత్రి.. రేపే గ్రూప్ 4 ఎగ్జామ్

అసిఫాబాద్ లో పోడు పట్టాల పంపిణీ

Advertisement

ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం అసిఫాబాద్లో మొదలైంది. పోడు భూముల కోసం పోరాటం చేసిన సందర్భంగా గిరిజన రైతులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చట్టపరంగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను తక్షణం ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆసిఫాబాద్లో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. మారుమూలన ఉన్న గిరిజన ఆవాసాలకూ త్రీ ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. తాము పంపిణీ చేసిన భూముల్లో గిరి వికాసం కింద బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.

రేపే గ్రూప్ 4 ఎగ్జామ్

రేపు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్ష జరుగనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.   9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కు అప్లై చేశారు. అందుకు వీలుగా టీఎస్పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా 2,878  పరీక్ష
కేంద్రాలు ఏర్పాటు చేసింది.  బయోమెట్రిక్‌ బదులు ఈసారి థంబ్‌ ఇంప్రెషన్ ద్వార అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంటారు.

ఔటర్ పై మరొక ఇంటర్ చేంజ్

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైన మరొక ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్ చేంజ్ ను శనివారం ఉదయం పది గంటలకు కేటీఆర్​ ప్రారంభించనున్నారు.

Advertisement

హైకోర్టుకు కొప్పుల ఈశ్వర్​

రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటింగ్ రోజు ఇచ్చిన ఫాం 22 ప్రకారం పోలైన ఓట్ల శాతం 79.1% ఉండగా ఆర్టీఐ ద్వారా అడిగితే 80.01% గా ఇచ్చారని, తాను కేవలం 400 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యానని లక్ష్మణ్​ కుమార్ కమిషన్ కు వివరించారు. ఇదే విషయంలో కమిషన్​ ఈశ్వర్​ను విచారించింది.

కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పీపుల్స్​ మార్చ్​

జులై 2న జరుగనున్న రాహుల్​ సభ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు రేంవత్​రెడ్డి సమీక్షించారు. ఖ‌మ్మం జిల్లాలోని త‌ల్లంపాడు వ‌ద్ద పాద‌యాత్ర శిబిరంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్కను కలుసుకున్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర తెలంగాణ సమాజానికి తప్పకుండా మేలు చేస్తుందని అన్నారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలను అధిగమించే పరిష్కారాలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ ఈస్ట్ మ‌న్ క‌ల‌ర్ లో చూపిస్తున్న భ్రమలను ఈ పాద‌యాత్ర ప‌టాపంచ‌లు చేసింద‌ని చెప్పారు.

ముగ్గురు పిల్లలతో తల్లి సూసైడ్

బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. – ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి మానేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. – మృతుల్లో తల్లి రజిత, పిల్లలు ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) ఉన్నారు. — వేములవాడ అర్బన్ మండలం రుద్రవరానికి చెందిన రజిత కరీంనగర్ లోని సుభాష్ నగర్ కి చెందిన మహ్మద్ అలీ తో లవ్ మ్యారేజ్ చేసుకుంది. – తల్లిగారి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి పిల్లలతో సహా రజిత ఇంటి నుంచి బయటికి వచ్చింది. పోలీసులు– మృతదేహాలను వెలికితీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

30 మందికి ఒకేసారి వీడియో కాల్

వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఫీచర్​ను తీసుకురానుంది. ఇప్పటికే విండోస్​లో వీడియో కాల్ చేసుకునే ఫీచర్​ను వాట్సాప్​ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఒకే సారి 30 మందితో వీడియో కాల్​ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉన్న ఈ ఫీచర్​ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్​లో గరిష్ఠంగా 8 మందితో వీడియో కాల్స్​.. 32 మందితో ఆడియో కాల్స్​ మాట్లాడే చాన్స్​ ఉండేది. కమ్యూనికేషన్​ ఫెసిలిటీని మరింత మెరుగుపరిచే పనిలో భాగంగా ఈ మెసేజింగ్ యాప్​ ప్రయోగాలు చేస్తోంది. తాజా ఫీచర్​ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్​ మీట్ వంటి యాప్స్​తో పనిలేకుండా వాట్సాప్​లోనే పెద్ద సంఖ్యలో గ్రూప్​ వీడియో కాల్స్​ మాట్లాడొచ్చు.

మోడీని మెచ్చుకున్న పుతిన్​

భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ ప్రశంసలు గుప్పించాడు. కేంద్రం అమలు చేస్తున్న మేకిన్​ ఇండియా కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారత్​లోని మన స్నేహితులు, రష్యాకు గొప్ప స్నేహితుడైన ఆ దేశ ప్రధాని మోదీ.. కొన్నేళ్ల కిందట మేకిన్​ ఇండియాను తీసుకువచ్చారు. ఈ విధానం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయన్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!