టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో లేని విధంగా.. ఈసారి ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రిలిమ్స్‌లో 1/5 నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఈవెంట్స్ లోనూ మార్పులు చేశారు. ఇప్పటివరకు పురుషులకు 800 మీటర్లు ఉండగా ఇప్పుడు దాన్ని 1600 మీటర్స్ చేశారు. మహిళలకు గతంలో 100 మీటర్లు ఉండగా ఇప్పుడు అది 800 మీటర్లకు పెంచారు.
ఎస్సై పోస్టులు: మొత్తం ఖాళీలు– 587. సివిల్– 414, ఏఆర్–66, సీపీఎల్– 5, టీఎస్ఎస్పీ–23, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్–12, డిజాస్టర్ రెస్పాన్స్–26, డిప్యూటీ జైలర్–8, ఐటీ–22, పోలీస్ ట్రాన్స్పోర్ట్– 3. ఫింగర్ ప్రింట్– 8.
కానిస్టేబుల్: మొత్తం ఖాళీలు– 16027. సివిల్– 4965, ఏఆర్–4423, టీఎస్ఎస్పీ–5010, ఫైర్‌మెన్–610, సీపీఎల్–100, డ్రైవర్– 100, స్పెషల్ పోలీస్ ఫోర్స్–390, ఐటీ–262, వార్డన్ (జైళ్లు)–136 (పురుషులు), 10 (మహిళలు), మెకానిక్–21.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మే2వ తేదీ నుంచి మే 20 వరకు దరఖాస్తుల చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ రూ.500 చెల్లించాలి.
ప్రిలిమ్స్: 200 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అన్ని కేటగిరీల అభ్యర్థులు 30శాతం (60 మార్కులు) సాధిస్తే ఈవెంట్స్ కు క్వాలిఫై అవుతారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ( 20% లేదా 1/5 ) ఉంటుంది.
ఈవెంట్స్
ఇంతకుముందు పురుష అభ్యర్థులకు ఐదు ఈవెంట్స్ (800మీ, 100మీ, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్ పుట్) ఉండగా, ఇప్పుడు మూడు ఈవెంట్స్ (1600మీ, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్) మాత్రమే ఉన్నాయి.
ఈవెంట్ పురుషులు ఎక్స్ సర్వీస్‌మెన్ మహిళలు
1600 మీటర్లు 7 నిమిషాల 15 సెకండ్లు 9 నిమిషాల 30 సెకండ్స్ –
800 మీటర్లు – – 8నిమిషాల 20 సెకండ్లు
లాంగ్ జంప్ 4 మీటర్లు 3.50 మీటర్లు 2.50 మీటర్లు
షార్ట్ పుట్
(7.26కేజీ మెన్, 4కేజీ ఉమెన్) 6 మీటర్లు 6 మీటర్లు 4మీటర్లు
మెయిన్స్
– కానిస్టేబుల్ మెయిన్స్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. ప్రిలిమినరీలో వచ్చిన అంశాల నుంచే ఫైనల్ రాతపరీక్షలోనూ ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకటే సిలబస్ ఉంటుంది.
– సబ్‌ఇన్‌స్పెక్టర్ మెయిన్స్‌లో నాలుగు పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్, తెలుగు/ఉర్దూ ఉంటాయి. ఇవి కేవలం క్వాలిఫయింగ్ పరీక్షలే. ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు పేపర్లు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్‌స్టడీస్, చివరి రెండు పేపర్లు, ఈవెంట్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు 40% క్వాలిఫైయింగ్ మార్కులు ఉంటాయి.
సబ్జెక్ట్ మార్కులు
పేపర్1 ఇంగ్లిష్ 100
పేపర్2 తెలుగు(ఉర్దూ) 100
పేపర్3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200
పేపర్4 జనరల్ స్టడీస్ 200
Thank you for information