HomeLATESTనిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

నిరుద్యోగులకు కేంద్ర విద్యాశాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38 వేలకు పైగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 38 వేలకు పైగా ఉండగా వేర్వేరు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అయితే.. నియామక విధానం, ముఖ్యమైన తేదీల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అధికారిక వెబ్ సైట్: https://tribal.nic.in/

Advertisement

విభాగాల వారీగా ఖాళీలు
ప్రిన్సిపల్‌ పోస్టులు: 740
వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులు: 740
పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) పోస్టులు: 8,880
ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) పోస్టులు: 8,840
ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు: 740
మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు: 740
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) పోస్టులు: 1,480
లైబ్రేరియన్‌ పోస్టులు: 740
కౌన్సెలర్‌ పోస్టులు: 740
స్టాఫ్‌ నర్సు పోస్టులు: 740
హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు: 1,480
అకౌంటెంట్‌ పోస్టులు: 740
సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 740
జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1480
క్యాటరింగ్ అసిస్టెంట్‌ పోస్టులు: 740
డ్రైవర్‌ పోస్టులు: 740
ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ పోస్టులు: 740
ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు: 740
గార్డెనర్‌ పోస్టులు: 740
కుక్‌ పోస్టులు: 470
మెస్‌ హెల్పర్‌ పోస్టులు: 1480
చౌకీదార్‌ పోస్టులు: 1480
స్వీపర్‌ పోస్టులు: 2,220

విద్యార్హతలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీలో ఉత్తీర్ణత వారు దరఖాస్తుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా.. అభ్యర్థులకు ఇంగ్లిష్/హిందీ/ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. ఇంకా.. వయోపరిమితి విషయానికి వస్తే.. దరఖాస్తుదారుల వయస్సు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000-రూ.2,09,200 వరకు వేతనం ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!