ఎంబీబీఎస్‌లో అడ్మిషన్స్ కోసం జూన్ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో నీట్ (NEET) పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయానికి వచ్చింది. గత ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష ఆలస్యం కావటంతో ఇప్పటికీ కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో నీట్ పరీక్షను ఈసారి జూన్ నెలఖారు లేదా జులై మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి.
జేఈఈ మెయిన్స్‌ను కూడా ఈసారి రెండు విడతల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హులను నిర్ణయించేందుకు ఎన్‌టీఏ ఏటా జేఈఈ మెయిన్ పరీక్షలు జరుపుతోంది. 2019, 2020లో ఆన్‌లైన్ విధానంలో రెండు విడతలుగా.. 2021లో కరోనా రెండోదశ కారణంగా విద్యార్థుల సౌలభ్యం కోసం నాలుగు విడతలుగా నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం(2022-–23) అడ్మిషన్లకు ఈసారి ఏప్రిల్, మే, జూన్‌లోనే ఈ పరీక్షలు జరపాలని ఎన్‌టీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్‌లో మొదటి విడత పరీక్ష, మే నెలాఖరులో రెండో విడత పరీక్షకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
దేశవ్యాప్తంగా గత ఏడాది జేఈఈ మెయిన్ 4 విడతలకు 10.48 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 9.39 లక్షల మంది పరీక్షలు రాశారు. నాలుగు సార్లు పరీక్షలు రాసినవారు 2.52,954 మంది ఉన్నారు. అది 27 శాతంతో సమానం. చివరి విడతకు అత్యధికంగా 7.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా అతి తక్కువగా 4.81 లక్షల మందే పరీక్ష రాయటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచి జేఈఈ మెయిన్‌కు దాదాపు లక్షన్నర మంది హాజరవుతారు.
NEET UG 2022 Exam in June జూన్ లేదా జులైలో నీట్.. రెండు విడతల్లో జేఈఈ మెయిన్స్..
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS