HomeLATESTఇంటిగ్రేటెడ్​ ఎమ్మెస్సీ అడ్మిషన్స్​కు నెస్ట్ 2022 షెడ్యూల్ ​

ఇంటిగ్రేటెడ్​ ఎమ్మెస్సీ అడ్మిషన్స్​కు నెస్ట్ 2022 షెడ్యూల్ ​


నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్)-–2022 షెడ్యూల్ రిలీజ్​ అయింది. ఈ పరీక్ష ద్వారా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్), భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ ల లో ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎం ఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.ఆసక్తి,అర్హత కల అభ్యర్థులు ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి మే 18 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.జూన్ 18 వ తేదీన దేశవ్యాప్తం గా సుమారు 115 పట్టణాల్లో ఎంట్రన్స్ జరుగుతుంది.ఫలితాలు జూలై 5 వ తేదీన విడుదల అవుతాయి.

Advertisement

అర్హత‌: సైన్స్ విభాగాల్లో క‌నీసం 60 శాతం/ త‌త్సమాన సీజీపీఏతో ఇంట‌ర్​ పూర్తి చేయాలి. వ‌య‌సు జ‌న‌ర‌ల్‌, ఓబీసీ స్టూడెంట్స్​ 1 ఆగ‌స్టు 2002 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు ఐదేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది. క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఎగ్జామ్​లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ 50 మార్కులతో మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ నాలుగు సెక్షన్లలో స్టూడెంట్​ ప్రతిభ‌క‌న‌బ‌రిచిన‌ మూడు సెక్షన్లను ప్రాతిప‌దిక‌గా తీసుకొని, స‌రిగా చేయ‌ని సెక్షన్‌కు వ‌దిలేస్తారు. మెరిట్ జాబితా ఈ మూడు సెక్షన్లలో సాధించిన మార్కుల ఆధారంగా త‌యారు చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎగ్జామ్​ సెంటర్స్​: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌. ఆన్​లైన్​లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూడీ వారు రూ.600 చెల్లించాలి.

వెబ్​సైట్​: www.nestexam.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!