HomeLATESTయూజీసీ నెట్​ రిజల్ట్ విడుదల

యూజీసీ నెట్​ రిజల్ట్ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC NET) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 రిజల్ట్ ను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ugcnet.nta.nic.in లో రిజల్ట్ ను చెక్​ చేసుకోవచ్చు.

మొత్తం 84 సబ్జెక్ట్ లకు సంబంధించిన ఫైనల్​ ఆన్సర్​ కీ లను కూడా NTA విడుదల చేసింది. పేపర్ఉ​ 1 మరియు పేపర్​ 2లో ఉమ్మడిగా వచ్చిన మొత్తం మార్కుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 40% కటాప్​గా నిర్ణయించింది. EWS/SC/ST/OBC/PwD/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు మొత్తం స్కోర్‌లో 35% కటాప్​గా ప్రకటించింది.

గత ఏడాది కరోనా కారణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) డిసెంబర్ 2020 మరియు జూన్ 2021లో జరగాల్సిన పరీక్షలు రెండింటినీ ఎన్​టీఏ విలీనం చేసింది. దాదాపు 12.67 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 84 వివిధ సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ అర్హత ఇచ్చేందుకు UGC-NET పరీక్ష నిర్వహిస్తారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!