HomeLATESTఎంట్రెన్స్​ లేకుండానే ఎంబీసీలకు అడ్మిషన్​

ఎంట్రెన్స్​ లేకుండానే ఎంబీసీలకు అడ్మిషన్​

ఎంబీసీ కులాలకు చెందిన విద్యార్థులకు ఎలాంటి ఎంట్రెన్స్​ నిర్వహించకుండానే మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల్లో అడ్మిషన్​ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఎంబీసీలకు ప్రత్యేక కోటాను కేటాయించనుంది. 2022–23 విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది గురుకులాల్లో 5వ తరగతిలో చేరే విద్యార్థులతో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న బ్యాక్​లాగ్​ సీట్లను భర్తీ చేసేందుకు ఎంట్రెన్స్​ నిర్వహిస్తారు. కానీ ఎంబీసీ స్టూడెంట్లకు ఎంట్రెన్స్​ రాసినా.. స్కోర్​ పరిగణనలోకి తీసుకోకుండా, అవసరమైతే ఎంట్రెన్స్​ రాయకుండానే వారికి కేటాయించిన ప్రత్యేక కోటాలో ప్రవేశాలు కల్పించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఎంబీసీ కులాల్లో పిల్లలు ఎక్కువగా డ్రాపౌట్స్​ ఉండడం, తల్లిదండ్రులతో వృత్తిలో సహాయంగా వారి వెంట వెళ్లడంతో చాలా మంది చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!