Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsరెసిడెన్షియల్​ కాలేజీల్లో ఇంటర్​ డిగ్రీ అడ్మిషన్ల ఎంట్రన్స్ 2023–24

రెసిడెన్షియల్​ కాలేజీల్లో ఇంటర్​ డిగ్రీ అడ్మిషన్ల ఎంట్రన్స్ 2023–24

తెలంగాణ బీసీ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరపు అడ్మిషన్లకు నిర్వహించే ఎంట్రన్స్​ టెస్ట్ నోటిఫికేషన్​ వెలువడింది. మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్, డిగ్రీ కాలేజీలకు ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్​కు, ఇంటర్​ సెకండియర్​ విద్యార్థులు డిగ్రీ కాలేజీలకు అప్లికేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

రాష్ట్రంలో 255 బీసీ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజీలున్నాయి. వీటిలో 130 బాలుర కాలేజీలు, 125 బాలికల కాలేజీలు. రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీ రెసిడెన్షియల్​ కాలేజీలున్నాయి. వీటిలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్​ రాయాల్సి ఉంటుంది. అందులో వచ్చే మార్కుల మెరిట్​ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఆన్​లైన్​ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 16 వ తేదీ వరకూ అప్లికేషన్లకు తుది గడువు ఉంటుంది. ఏప్రిల్ 29 వ తేదీన ఎంట్రన్స్​ ఎగ్జామ్​ నిర్వహించనున్నట్లు మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCW) సెక్రెటరీ డాక్టర్​ మల్లయ్య బట్టు ప్రకటన విడుదల చేశారు.
ఆన్​లైన్ లో అప్లికేషన్ల నమోదుకు డైరెక్ట్ లింక్​ http://mjptbcwreis.telangana.gov.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!