హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ఈ నెల 29న భారీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. దాదాపు 1500 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేసింది. 15 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్‌మేళా ద్వారా నియామకాలు చేపట్టనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, బిగ్ బాస్కెట్, విజయ డయాగ్నస్టిక్ సెంటర్, అపోలో ఫార్మసీతో పాటు వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్‌మేళాలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ లింక్ bit.ly/jcepass
ఈ లింక్ లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అందులో మీ పేరు, వయస్సు, ఫోన్ నంబర్, చిరునామా, ఈమెయిల్ ఐడీ, విద్యార్హతల వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ముషీరాబాద్ మెయిన్ రోడ్డులో కవాడిగూడ సమీపంలోని Heritage Palace, 1-47-908/7, Musheerabad Main Rd, అడ్రస్‌లో జరిగే జాబ్‌మేళాకు అటెండ్ కావాలి.