తెలంగాణాలో జూన్ 12న నిర్వహించిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)–2022 ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 27న టెట్ ఫలితాలు విడుదలవుతాయని టెట్ రాసిన 3.5లక్షల మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫైనల్ రిలీజ్ కాకపోవడం మరిన్ని ఇతర కారణాల వల్ల టెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. జూన్ 15న టెట్ ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసిన టెట్ అధికారులు 18వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
పేపర్–1 సంబంధించి 5 ప్రశ్నలకు గాను 7వేలకు పైగా, పేపర్–2 సంబంధించి 2 ప్రశ్నలకు 2వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ఫైనల్ ‘కీ’ ని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ షెడ్యూల్ ప్రకారం మరో రెండ్రోజుల్లో టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా… ఇప్పటి వరకు టెట్ ఫైనల్ ’కీ’ విడుదల కాకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని టెట్ పరీక్షలకు ప్రాథమిక ‘కీ’తో పాటు ఫైనల్ ‘కీ’ విడుదల చేసిన తర్వాతనే ఫలితాలను ప్రకటించారు. కానీ ఈ సారి మాత్రం టెట్ ఫైనల్’కీ’ విడుదల చేయకుండానే.. డైరెక్ట్‌గా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే రిజల్ట్స్ ఏ తేదీన విడుదల చేస్తారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. జులై మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు అంచనాగా చెబుతున్నాయి.
Superb
Wow
Wow
Hii