ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 8 గంటల నుండి 5వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ఒకే సారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతాక్రమంలో ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విడత తో పాటు మిగిలిన విడత కౌన్సిలింగ్ లకు ఈ ఆప్షన్ల ఆధారంగానే సీటు కేటాయింపులు జరుగుతాయి. అభ్యర్థులు ఇది గమనించి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతాక్రమంలో తప్పని సరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
పూర్తి వివరాలు వెబ్‌సైట్ https://tsmedadm.tsche.in, www.knruhs.telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ వర్గాలు ప్రకటించాయి.
తెలంగాణ ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్; రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS