HomeLATESTజేఎన్‌టీయూహెచ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు

జేఎన్‌టీయూహెచ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు


హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌సీడీఈ) 2022 విద్యాసంవత్సరానికి కింది సర్టిఫికెట్‌ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు.

కోర్సులు:

1) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌

అర్హత: బీటెక్‌ / బీఎస్సీ (కంప్యూటర్స్‌)/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ (కంప్యూటర్స్‌/ మ్యాథ్స్‌) ఉత్తీర్ణత.

2) ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌

అర్హత: బీఫార్మసీ/ బీఎస్సీ/ ఎమ్మెస్సీ (సైన్స్‌ విభాగం) ఉత్తీర్ణత.

3) క్లౌడ్‌ అండ్‌ డెవొప్స్‌

అర్హత: బీటెక్‌ / ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ (కంప్యూటర్స్‌) ఉత్తీర్ణత.

4) వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ప్రకారం నిర్వహిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: రూ.500 చెల్లించాలి.

చివరి తేది: 19 ఫిబ్రవరి

వెబ్​సైట్​: www.doa.jntuh.ac.in

నిట్​, వరంగల్‌​లో ఎంబీఏ

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం 2022 విద్యాసంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాములో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణత. వాలిడ్‌ క్యాట్‌/ మ్యాట్‌ స్కోర్‌ ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: వాలిడ్‌ క్యాట్‌/ మ్యాట్‌ మెరిట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి.

అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28 ఫిబ్రవరి

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: 2022, మార్చి 28 -30.

వెబ్​సైట్​: www.nitw.ac.in

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో పీజీ డిప్లొమా

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) 2022 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

1) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ – రూరల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఆర్‌ఎం)

కోర్సు డ్యురేషన్​: రెండు సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ ఏటీఎంఏ/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌ వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

2) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఆర్‌డీఎం)

కోర్సు డ్యురేషన్​: ఏడాది.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

సెలెక్షన్​ ప్రాసెస్​: బ్యాచిలర్స్‌ డిగ్రీ, వాలిడ్‌ స్కోర్స్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని గ్రూప్‌ డిస్కషన్‌ అండ్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి.

చివరి తేది: 10 ఏప్రిల్​

వెబ్​సైట్​: www.nirdpr.org.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!