హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022- – 23 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో (ఇంగ్లిష్ మీడియం) అడ్మిషన్స్‌కు అర్హులైన బాల, బాలికల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: ఆరో తరగతి విద్యార్థులు ఐదో తరగతిలో, ఏడో తరగతి అభ్యర్థులు ఆరో తరగతిలో, ఎనిమిదో తరగతి అభ్యర్థులు ఏడో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. 2022- – 21, 2021 – -22 సంవత్సరాల్లో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో ఏడాదికి రూ.1,50,000, పట్టణాల్లో ఏడాదికి రూ.2,00,000 మించకూడదు.
వయసు: 31 ఆగస్టు 2022 నాటికి ఆరో తరగతి విద్యార్థులు 12 ఏళ్లు, ఏడో తరగతి విద్యార్థులు 13 ఏళ్లు, ఎనిమిదో తరగతి విద్యార్థులు 14 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంట్రన్స్ టెస్టులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. జూన్ 19వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.