హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి(టీఎస్‌సీహెచ్ఈ) 2022- – 2023 విద్యాసంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్‌పీఈసెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆన్లైన్లో జూన్ 18వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ రూ.800, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.400 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు ఆగస్టు 22వ తేదీన జరగుతాయి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.pecet.tsche.ac.in సంప్రదించాలి.
Pecet notification