నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2022 – -2023 విద్యాసంవత్సరానికి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (డీయూఈటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తున్నారు.
ప్రోగ్రాములు: ఎంఏ, ఎంకాం, బీఈడీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ తదితర ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. అరబిక్, బుద్ధిస్ట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, సైకాలజీ, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ, ఆంథ్రపాలజీ, హోమ్ సైన్స్ కోర్సులు అందిస్తున్నారు.
సెలెక్షన్ ప్రాసెస్: కోర్సులను అనుసరించి మెరిట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది.