హైదరాబాద్ లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ DRDO పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్ – 1 పోస్టు
ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ – 05 పోస్టులు
ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ – 05 పోస్టులు
మొత్తం ఖాళీలు -11
అర్హతలు : పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు 56ఏళ్లకు మించి ఉండకూడదు.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. చివరి తేదీ 15-12-2023
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.