హైదరాబాద్ మెట్రోలో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. దాదాపు 46 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే… పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రోలో 9 హోదాల్లో ఉద్యోగాల భర్తీకి ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా గత పరీక్షల్లో ఉన్న మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల సెలెక్షన్ ఉంటుంది.
పోస్టులు
సిగ్నలింగ్ టీమ్ లీడర్ | 03 |
రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ | 01 |
రోలింగ్ స్టాక్ ఇంజనీర్ | 01 |
AFC/COM మెయింటెయినర్ | 05 |
రైలు ఆపరేటర్ | 30 |
AFC/COM సిస్టమ్ అనలిస్ట్ | 01 |
PSS ఇంజనీర్ | 01 |
PSS టీమ్ లీడర్ | 02 |
MEP టీమ్ లీడర్ | 02 |
మొత్తం ఖాళీలు | 46 |
విద్యార్థతలు: ఆయా పోస్టులను బట్టి విద్యార్హతల్లో తేడాలున్నాయి. డిప్లొమా, ఐటిఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు. సంబంధిత పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యముంటుంది.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్లు: అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఈ మెయిల్ ద్వారా తమ అప్లికేషన్లను పంపించాలి. అఫిషియల్ వెబ్సైట్లో https://www.ltmetro.com/ పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లో CAREER ఆప్షన్ క్లిక్ చేసి Current Oppurtunities ట్యాబ్ క్లిక్ చేసి పోస్టుల వివరాలు తెలుసు కోవచ్చు. అభ్యర్థులు ఫిల్ అప్ చేసిన అప్లికేషన్లను keolisHyd.Jobs@keolishyderabad.com కు మెయిల్ చేయాలి.
సెలెక్షన్ ప్రొసిజర్: అప్లై చేసుకున్న అభ్యర్థులను గత విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వారందరూ క్వాలిఫై అయినట్లుగా పరిగణించి.. స్కిల్ టెస్ట్ పెట్టి.. అందులో వచ్చే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు