Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSహైదరాబాద్‌ హెచ్‌ఏఎల్‌లో 178 అప్రెంటిస్ ఖాళీలు

హైదరాబాద్‌ హెచ్‌ఏఎల్‌లో 178 అప్రెంటిస్ ఖాళీలు

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో అప్రెంటిస్​ ఖాళీల ప్రకటన వెలువడింది. హైదరాబాద్ లోని బాలానగర్‌లోని హెచ్​ఏఎల్ లో ఈ అప్రెంటిస్​ శిక్షణను అందిస్తారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్​కు అర్హులవుతారు. ఎంపికైన వారికి శిక్షణ సమయంలో ప్రతినెలా స్టైఫండ్ చెల్లిస్తారు.

Advertisement

ట్రేడ్‌ అప్రెంటిస్: 178 ఖాళీలు

ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్‌మ్యాన్- సివిల్, డ్రాప్ట్స్‌మ్యాన్- మెకానికల్.

అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

రిజిస్ట్రేషన్లు: ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్​ ఫామ్​ కాపీని వాక్​ ఇన్​ ఇంటర్వ్యూ రోజున అందజేయాల్సి ఉంటుంది.

వాక్‌ ఇన్‌ తేదీలు: మే 17, 18, 19 తేదీల్లో అభ్యర్థులు నేరుగా తమ సర్టిఫికెట్లతో వాక్​ ఇన్​ ఇంటర్వ్యూకు అటెండ్​ కావాల్సి ఉంటుంది.

వాక్​ ఇన్ సెంటర్​: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్‌ డెవలప్‌మెంట్ ఆడిటోరియం, హెచ్‌ఏఎల్‌, బాలానగర్, హైదరాబాద్.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!