దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు (IIT), ఎన్ఐటీలు (IIT), ఇతర జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన సిలబస్ లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు అధికారులు కొత్త సిలబస్ ను జేఈఈ వెబ్ సైట్లో (https://jeemain.nta.nic.in/) పొందు పర్చారు. మాథ్స్ కు సంబంధించి ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ టాపిక్ ను పూర్తిగా తొలగించారు. ఇంకా రిలేషన్స్, సెట్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్ పై కొంత సిలబస్ ను అదనంగా చేర్చారు.
ఇంకా ఫిజిక్స్ కు సంబంధించి యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్ ను తొలగించారు. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో-ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రం బైనరీ మిక్చర్స్ భాగాన్ని తొలిగించనట్లు వెబ్ సైట్లో పేర్కొన్నారు.