జేఈఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి జాస్తి యశ్వంత్ దేశంలోనే టాపర్‌గా నిలిచారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2022 మొదటి విడత ఫలితాలు విడుదల అయ్యాయి. జూలై 10 వ తేదీ (ఆదివారం) రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) స్కోర్ కార్డులని వెబ్ సైట్ లో అందుబాటు లో ఉంచింది. ప్రస్తుతం పేపర్-1 ఫలితాలు మాత్రమే వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం 14 మంది 100 స్కోర్ సాధించారు. అందులో మొదటి ర్యాంకర్ గా తెలంగాణా కి చెందిన జాస్తి యశ్వంత్ నిలిచారు. మూడు, నాలుగవ స్థానాల్లోనూ తెలంగాణ విద్యార్థులే ఉన్నారు. అంకిత్ థర్డ్ ర్యాంక్.. ధీరజ్ ఫోర్త్ ర్యాంక్‌లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సుహాస్ అయిదో స్థానంలో నిలిచారు. 10,11 ర్యాంకర్ల గా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు,14 వ ర్యాంకర్ గా తెలంగాణా అభ్యర్థి నిలిచారు. పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య,పుట్టిన తేదీ,సెక్యూరిటీ పిన్ సాయం తో లాగిన్ అయి స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.https://jeemain.nta.nic.in/
Hmmm