ఈ ఏడాదిలో ఐటీ రంగంలో లక్షల సంఖ్యలో జోరుగా నియామకాలు ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 ఆంక్షలు దాదాపు ఎత్తివేశారు. దాంతో అన్ని రంగాల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఇండస్ట్రీ భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ అక్టోబర్ 2021- మార్చి 2022 మధ్యకాలంలో 4.5 లక్షల ఉద్యోగులను చేర్చుకోనుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అన్ ఎర్త్ ఇన్‌సైట్ తాజా నివేదిక వెల్లడించింది. ఒకవైపు వలస ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుండగా.. మరోవైపు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగవంతం చేయాలని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఐటీ రంగంలో చేరే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోనుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022 ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే 12 శాతం ఎక్కువగా ఉద్యోగులు ఐటీ రంగంలో చేరనున్నారని అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ ఐటీ ఇండస్ట్రీ క్యూ2 ఇన్‌సైట్స్ & ఎఫ్‌వై22 ఫోర్‌కాస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
ఫ్రెషర్స్‌కు ఫుల్ డిమాండ్
ఆర్థిక సంవత్సరం 2022 ద్వితీయార్థంలో 17-19 శాతం అట్రిషన్ తో 1.5-1.75 లక్షల నికర ఉద్యోగుల చేరిక ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. ఇందులో లాటరల్స్ అనుభవజ్ఞులైన నిపుణుల నియామకం ఉంటుంది. డిమాండ్ ఎన్నడూ లేని విధంగా అధికంగా ఉండటంతో.. భారతదేశంలోని కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను కూడా పెంచుతున్నాయి. నివేదిక ప్రకారం, భారతదేశంలోని నేషనల్, మల్టీ నేషనల్ సంస్థలతో పాటు ఐటీ సంస్థలు ఎఫ్‌వై22 (FY22)లో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల 50 వేల మంది ఫ్రెషర్లు నియమించుకున్నాయి. టీసీఎస్ 77 వేలు, ఇన్ఫోసిస్ 45 వేలు, కాగ్నిజెంట్ 45 వేలు, హెచ్‌సీఎల్ టెక్ 22 వేల ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
స్కిల్స్‌పై ఫోకస్