HomeLATESTఇక్కడ బీటెక్​… ఫ్లైటెక్కి ఫారిన్​లో ఎంఎస్​

ఇక్కడ బీటెక్​… ఫ్లైటెక్కి ఫారిన్​లో ఎంఎస్​


సాధారణ డిగ్రీ కన్నా బీటెక్‌ లాంటి టెక్నికల్​ కోర్సుకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. బీటెక్‌ చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, జీవితంలో త్వరగా స్థిరపడేందుకు వీలవుతుందని తల్లిదండ్రులు, విద్యార్థులు భావిస్తుండటమే ఇందుకు కారణం. బీటెక్‌ తర్వాత ఎంటెక్‌ చేయడం కూడా ఒక కలగా ఉండేది. చాలామంది బీటెక్‌తో ఆపకుండా ఎంటెక్‌లో చేరేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ తర్వాత ట్రెండ్‌ మారిపోయింది. ఇటీవలి కాలలో ఎంటెక్‌లో ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోయాయి.

Advertisement

బీటెక్‌ తర్వాత టార్గెట్​ ఎంఎస్​

బీటెక్‌లో ఉండగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారానో, బీటెక్‌ తర్వాత ఏదోరకంగా.. మంచి కంపెనీలో ఆకర్షణీయమైన ప్యాకేజీతో ఉద్యోగం వస్తే సరేసరి. లేదంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థీ అమెరికా.. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో ఎమ్మెస్‌ కోసం వెళ్లిపోతున్నాడు.

చదువుతోనే సంపాదిస్తున్నారు

Advertisement

అప్పు చేసైనా పిల్లలను విదేశాలకు పంపాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో కనబడుతోంది. ఏదేమైనా ఎమ్మెస్‌ చేసి తీరాలన్న కోరిక మెజారిటీ విద్యార్థుల్లో బలంగా ఉంటోంది. మరోవైపు బ్యాంకులు కూడా స్వదేశీ విద్య కన్నా విదేశీ విద్యకే రుణాలు ఎక్కువగా ఇస్తున్నాయి. అయితే విదేశీ చదువులకు విద్యార్థులు కేవలం చదువు కోసమే వెళ్ళడం లేదు. చదువుకుంటూనే సంపాదించుకునేందుకు, చేసిన అప్పులు తీర్చేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. చదువుకుంటున్న సమయంలోనే అనధికారికంగా చిన్ని చిన్న ఉద్యోగాలతో సంపాదించుకునే అవకాశాలు పలు దేశాల్లో ఉంటున్నాయి. అలా రెండేళ్లల్లో ఎంఎస్‌ కోర్సు పూర్తిచేసి, వీసా అవకాశం ఉన్న మరో రెండేళ్ళ సమయంలో ఏదో ఒక ఉద్యోగంలో చేరి అక్కడ స్థిరపడిపోయేవారు అధిక సంఖ్యలో ఉంటున్నారు.

ఎంటెక్​ పై ఇంట్రస్ట్​ తగ్గింది

ప్రధాన కంపెనీలు చాలావరకు బీటెక్‌ డిగ్రీ కనీస అర్హతతోనే ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఎంటెక్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ కారణంగా ఎంటెక్‌ చేసినా ప్రయోజనం ఏమిటనే భావన విద్యార్థుల్లో నెలకొంటోంది. ఒకప్పుడు బీటెక్‌ తర్వాత ఉద్యోగం రాకుంటే టైమ్​ వేస్ట్​ కాకుండా ఎంటెక్‌లో చేరేవారు. ఎంటెక్‌లో చేరినా ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టేందుకు, ఉపాధి అవకాశాలు వెతుక్కునేందుకు అప్పట్లో అవకాశం ఉండేది. బయో మెట్రిక్‌ హాజరు అమలులోకి వచ్చిన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎంటెక్‌లో చేరేవాళ్ల శాతం గణనీయంగా తగ్గింది. బీటెక్‌ పూర్తయిన తర్వాత గేట్‌ రాసి ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీటు వస్తుందనుకున్నప్పుడు మాత్రమే ఎంటెక్‌లో చేరేందుకు ఇష్టపడుతున్నారు

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!