HomeLATESTటెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు ప్రముఖ ఇస్రో (ISRO) సంస్థ శుభవార్త చెప్పింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఉద్యోగాల (Central Government Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్-ఎ, డ్రాట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-ఎ విభాగాల్లో 49 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 4న ప్రారంభమైంది.

Advertisement

దరఖాస్తు చేసుకోవడానికి మే 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ vssc.gov.in లేదా isro.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:

అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!